పిల్లల భద్రతపై ఎస్పీ హెచ్చరిక
AKP: వేసవి సెలవులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో విద్యార్థులు, చిన్న పిల్లల భద్రతపై తల్లిదండ్రులు నిఘా ఉంచాలని ఎస్పీ తుహిన్ సిన్హా కోరారు. వేసవి సెలవుల్లో పిల్లలు చెరువులు, బావులు, సముద్ర తీరాల వద్దకు వెళ్లనివ్వరాదని చెప్పారు. సెలవుల్లో పిల్లలను ఆట పాటలు, కథల పుస్తకాలు చదవడం లేదా వేసవి శిక్షణ శిబిరాల వైపు మళ్లించాలన్నారు.