VIDEO: ఆటోమేటెడ్ కార్ పార్కింగ్‌ను ప్రారంభించిన మేయర్
HYD: కేబీఆర్ పార్కు వద్ద జీహెచ్ఎంసీ, నిర్మాన్ అసోసియేట్స్ సంయుక్తంగా ఆటో మేటెడ్ స్మార్ట్ రోటరీ కార్ పార్కింగ్ నిర్మించింది. ఈ సందర్భంగా జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రారంభించారు. ఆటోమేటెడ్ స్మార్ట్ రోటరీ కార్ పార్కింగ్ ప్రారంభంతో కేబీఆర్ పార్క్ వద్ద పార్కింగ్ కష్టాలు తొలగనున్నట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, తదితరులు పాల్గొన్నారు.