లెక్చరర్ లైంగిక వేధింపులతో విద్యార్థి సూసైడ్!
AP: విశాఖ MVP కాలనీలో విషాదం చోటుచేసుకుంది. సమతా డిగ్రీ కాలేజీ ఫైనల్ ఇయర్ విద్యార్థి సాయితేజ(24) హాస్టల్ గదిలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. సాయితేజ ఆత్మహత్యకు కాలేజీలోని ఓ మహిళా లెక్చరర్ లైంగిక వేధింపులే కారణమని తెలుస్తోంది. దీంతో సదరు లెక్చరర్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సాయితేజ స్నేహితులు, సహచరులు కాలేజీలో ఆందోళన చేపట్టారు.