రోడ్డులో ఇరుక్కుపోయిన బస్సు
NLR: కలువాయి మండలం దాచురు వద్ద పెంచలకోన నుంచి నెల్లూరు వస్తున్న బస్సు బురదమయమైన రోడ్డులో ఇరుక్కుపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్ల దుస్థితి గురించి ఎన్నిసార్లు అధికారులకు తెలిపినా చర్యలు తీసుకోకపోవడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. వరుస వర్షాలతో రహదారులు మరింత దెబ్బతినడంతో రాకపోకలు కష్టంగా మారాయి.