VIDEO: కొనుగోలు కేంద్రాల కోసం రైతుల డిమాండ్
WGL: రాయపర్తి మండలంలో మొక్కజొన్న రైతులు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని రైతులు కోరుతున్నారు. 40 పంచాయతీల పరిధిలో 6,200 ఎకరాల్లో సాగు చేసిన పంటను నూర్పిడి చేసి కళ్లాల్లో నిల్వ చేసినప్పటికీ కేంద్రాలు ప్రారంభం కాకపోవడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే మద్దతు ధరకు పంటను కొనుగోలు చేయాలని శనివారం రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు.