గుడి అభివృద్ధికి లక్ష సహాయం అందజేత

అన్నమయ్య: రైల్వే కోడూరు మండలం బొజ్జివారిపల్లి పంచాయతీ వడ్డిపల్లి గ్రామంలోని మాతమ్మ తల్లి గుడి అభివృద్ధి కోసం శుక్రవారం ముక్కా రూపానంద రెడ్డి ఫౌండేషన్ రూ. 1 లక్ష గ్రామస్తులకు అందజేసింది. ఈ మేరకు దేవాలయాల అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల పురోభివృద్ధికి కృషి చేస్తామని ఫౌండేషన్ పేర్కొంది. అనంతరం గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.