VIDEO: 'చెత్త కుప్పలు తొలగించండి'

ELR: నూజివీడు పట్టణ పరిధిలో మున్సిపల్ అధికారుల తీరు ఏమాత్రం మారడం లేదంటూ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట చెత్త కుప్పలు కుప్పలుగా ఉన్నప్పటికీ పరిశుభ్రం చేయడం లేదంటున్నారు. వీధుల వెంట సంచరించే కుక్కలు, గోవులు చెత్త కుప్పలలోని ప్లాస్టిక్ వ్యర్ధాలను తింటున్నాయని వాపోయారు.