మట్టి వినాయకులను పూజిద్దాం: ఎంపీ చామల

BHNG: మట్టి వినాయకుడిని పూజించి పర్యావరణాన్ని పరిరక్షిద్దామని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వ ఆధ్యాత్మికవేత్త, ఐవీఎఫ్ రాష్ట్ర ధార్మిక పరిషత్ ఛైర్మన్ వంగపల్లి అంజయ్య నిర్వహించిన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మట్టి వినాయకుల పూజతో పర్యావరణానికి మేలు జరుగుతుందని అన్నారు.