VIDEO: పంట కాలువలోకి దూసుకెళ్లిన బైక్... వ్యక్తి సురక్షితం

VIDEO: పంట కాలువలోకి దూసుకెళ్లిన బైక్... వ్యక్తి సురక్షితం

కోనసీమ: అమలాపురం రూరల్ మండలం సమనస గ్రామం రంగాపురం వద్ద బుధవారం రాత్రి బైక్ అదుపుతప్పి పంట కాలువలో పడింది. స్థానికులు వెంటనే స్పందించి, ఆ వ్యక్తిని క్షేమంగా బయటికి తీశారు. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆ కాలువకు రక్షణ కూడా లేకపోవడంతో తరచూ అనేక ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు చెప్తున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.