అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

అంబులెన్సులో ప్రసవం.. తల్లీబిడ్డ క్షేమం

ASF: లింగాపూర్ మండలం చిన్న దాంపూర్ గ్రామానికి చెందిన కుమ్ర సంగీతకు శనివారం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో నొప్పులు అధికం కావడంతో ఈఎంటీ రవి, పైలట్ దయాకర్ సమయస్ఫూర్తితో వాహనంలోనే ప్రసవం చేశారు. సంగీత ఆడబిడ్డకు జన్మనివ్వగా, తల్లీబిడ్డలిద్దరూ క్షేమంగా ఉన్నారని తెలిపారు.