RTC ఉద్యోగులకు UBI శుభవార్త
HYD: రాష్ట్ర ఆర్టీసీ ఉద్యోగులకు శుభవార్త. తమ బ్యాంక్‌లో శాలరీ అకౌంట్ కలిగిన ఆర్టీసీ సిబ్బందికి సామాజిక భద్రతను పెంచుతూ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(UBI) కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా సహజ మరణం పొందిన ఉద్యోగుల కుటుంబాలకు అదనంగా రూ.10 లక్షల ఉచిత బీమా సొమ్ము ఇవ్వనుంది. APR 1 నుంచే అమల్లోకి వచ్చిందని .. గతంలో ఉన్న రూ.కోటి రూపాయల బీమా యథాతథంగా ఉంటుందని పేర్కొంది.