డిప్యూటీ స్పీకర్‌ను కలిసిన గ్రంథాలయ శాఖ ఛైర్మన్
ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్‌గా ఎన్నికైన జనసేన ఉండి నియోజకవర్గ ఇంఛార్జ్ జుత్తిగ నాగరాజు సోమవారం ఉండి ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నాగరాజు ఎమ్మెల్యేకు మొక్కను, శాలువాను అందించి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు నాగరాజును అభినందించారు.