'ఎండిన భారీ వృక్షాలు.. తొలగించని అధికారులు'
MHBD: తొర్రూరు మండల కేంద్రంలోని టీచర్స్ కాలనీ ప్రధాన రహదారి పక్కన పలుచోట్ల ఎండిన భారీ వృక్షాలు ప్రమాదకరంగా మారాయి. ఈదురు గాలులకు చెట్లు రోడ్డుపై కూలిపోయే అవకాశం ఉందని స్థానికులు, వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండిన వృక్షాలతో ఎలాంటి ప్రమాదాలు జరగకముందే అధికారులు స్పందించి ఆ వృక్షాలను తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.