ఉచిత హెల్త్ క్యాంపును ప్రారంభించిన ఎమ్మెల్యే
BDK: దమ్మపేట మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యశాల నందు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఇవాళ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం నిర్వహిస్తున్న ఉచిత హెల్త్ క్యాంపులలో ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం ద్వారా జబ్బులను ముందుగానే గుర్తించవచ్చన్నారు.