VIDEO: పారిశుద్ధ్య పనులను పరిశీలించిన కలెక్టర్
ప్రకాశం: ఒంగోలులోని మున్సిపాలిటీ పరిధిలో పారిశుద్ధ్య పనులను జిల్లా కలెక్టర్ రాజా బాబు శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా చెత్తచెదారాలు, మురుగునీరు లేకుండా ఎప్పటికప్పుడు సైడ్ కాలువలను శుభ్రపరచాలని పారిశుద్ధ్య సిబ్బందిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్‌తో పాటు సంబంధిత అధికారులు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.