'ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలి'
HYD: ఇందిరాపార్క్ వద్ద ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు మహాధర్నా నిర్వహించారు. ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేపట్టారు. ఉద్యోగుల మహాధర్నాకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత మద్దతు తెలిపారు. ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరించాలని, ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి పరిష్కరించాలని తెలిపారు.