బీచ్‌లో యంత్రాలతో వ్యర్థాల తొలగింపు
విశాఖ ఉత్సవాలు ముగియడంతో ఆర్కే బీచ్‌ను శుభ్రం చేసే పనిని GVMC వేగవంతం చేసింది. సందర్శకుల తాకిడి వల్ల పేరుకుపోయిన చెత్తను తొలగించేందుకు యంత్రాలను వినియోగిస్తున్నారు. ఇసుకలో చిక్కుకున్న ప్లాస్టిక్, ఇతర వ్యర్థాలను ఏరివేస్తున్నారు. పర్యాటకులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తీరాన్ని మునుపటిలా తీర్చిదిద్దుతున్నారు.