'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాకు వర్ష సూచన

'దిత్వా' ఎఫెక్ట్.. జిల్లాకు వర్ష సూచన

'దిత్వా' తుపాను ప్రభావంతో తూర్పు గోదావరి జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరించింది. దీంతో అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే, సముద్రంలో వేటకు వెళ్లే  మత్స్యకారులను జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అవసరమైతే తప్పా ఎలాంటి ప్రయాణాలు చేయవద్దన్నారు.