టెంపో బోల్తా.. ఐదుగురి మృతి
కర్ణాటకలోని ఉడిపి జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. కోతల్కట్టే దగ్గర టెంపో బోల్తా పడటంతో ఐదుగురు మృతి చెందారు. మృతలాంతా అసోంకు చెందిన కార్మికులుగా గుర్తించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.