నూజివీడులో పర్యటించిన పాలీసెట్ రాష్ట్ర సెక్రటరీ

కృష్ణ: నూజివీడు పట్టణంలో పాలీసెట్ రాష్ట్ర సెక్రటరీ జీవి రామచంద్రరావు మంగళవారం పర్యటించారు. పట్టణంలో ఏర్పాటు చేసిన పాలీ సెట్ సెంటర్లను పరిశీలించారు. సెట్ నిర్వహణ పట్ల అవగాహన కల్పించారు. జడ్పీ గర్ల్స్ హైస్కూల్లో 312, బాయ్స్ హై స్కూల్‌లో 450 మంది విద్యార్థులు సెట్ రాయనున్నారు. ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం ఒంటిగంట వరకు సెట్ నిర్వహిస్తారు.