సైలాడ వీఆర్వోగా అప్పారావు బాధ్యతలు స్వీకరణ
SKLM: ఆమదాలవలస మండలం సైలాడ గ్రామ సచివాలయం వీఆర్వోగా బొడ్డేపల్లి అప్పారావు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన సాధారణ బదిలీల్లో భాగంగా సరుబుజ్జిలి మండలం మూలసవలాపురం గ్రామ సచివాలయం నుంచి సైలాడ వీఆర్వోగా వచ్చారు. బాధ్యతలు చేపట్టిన వీఆర్వోను మాజీ సర్పంచ్ జోగి చంద్రశేఖర్, సచివాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.