'సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి'

'సంఘం భవన నిర్మాణానికి స్థలం కేటాయించాలి'

BHPL: చిట్యాల మండలం కైలాపూర్ గ్రామానికి చెందిన స్నేహ పరస్పర సహాయక-సహకార పొదుపు పరపతి సంఘం అధ్యక్షురాలు ఆవుల భాగ్యలక్ష్మి ఆధ్వర్యంలో బుధవారం MRO ఇమామ్ బాబా షేక్ కు వినతి పత్రం అందజేశారు. ఆమె మాట్లాడుతూ.. సంఘం భవన నిర్మాణానికి గ్రామంలో ప్రభుత్వ స్థలాన్ని కేటాయించాలని తహసిల్దార్‌ను కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం కార్యదర్శి శ్రావణి, సంఘం సభ్యులు పాల్గొన్నారు.