VIDEO: ఎన్సీసీ మార్చ్ ఫాస్ట్, అడ్మిషన్ క్యాంపెయిన్
MDK: మెదక్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో 99 రోజుల కార్యాచరణలో భాగంగా NCC మార్చ్ ఫాస్ట్, అడ్మిషన్ క్యాంపెయిన్ నిర్వహించారు. ఇంఛార్జ్ ప్రిన్సిపల్ సింహారెడ్డి నేతృత్వంలో బస్టాండ్ నుంచి రాందాస్ చౌరస్తా వరకు ర్యాలీ జరిగింది. ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ పెంపొందించడంతో పాటు, కళాశాలలో ప్రవేశాల పట్ల అవగాహన కల్పించడమే కార్యక్రమ ఉద్దేశమన్నారు.