'గిరి ప్రాంతాల్లో మెరుగైన వైద్యం అందించాలి'
ADB: గిరిజన ప్రాంతాల్లోని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్ అన్నారు. ఆయన బుధవారం నార్నూర్ మండల కేంద్రంలోని PHC ఆసుపత్రిని సందర్శించిన అనంతరం తాడిహత్నూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ.. వేసవి కాలం దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు.