84 ఎర్రచందనం దుంగలను పట్టుకున్న పోలీసులు

కడప: జిల్లా భాకరాపేట చెక్ పోస్టు వద్ద మినీ లారీలో క్యాబేజీ మూటల మాటున అక్రమంగా తరలిస్తున్న 84 ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ దుంగల విలువ రూ.11 లక్షలుగా అంచనా వేశారు. నిందితులు లారీని వదిలేసి పరారయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.