పెద్దఆవుటపల్లిలో ‘రైతన్న మీకోసం’ వర్క్‌షాప్
కృష్ణా: ఉంగుటూరు మండలం పెద్దఆవుటపల్లి రైతు సేవా కేంద్రంలో ‘రైతన్న మీకోసం’ వర్క్‌షాప్ బుధవారం నిర్వహించారు. వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్ విజయలక్ష్మి రైతులకు GVA పెంపు కోసం ప్రణాళిక తయారీపై సూచనలు చేశారు. వ్యవసాయ, ఉద్యాన, పశువుల శాఖల సమన్వయంతో రాబోయే ఖరీఫ్–రబీ సీజన్లకు సిద్ధం కావాలని ఆదేశించారు. ADA సునీల్ ఎరువుల సమర్థ వినియోగంపై సూచనలు చేశారు.