VIDEO: బెల్లంపల్లి పట్టణంలో కొనసాగుతున్న బంద్
MNCL: బెల్లంపల్లి పట్టణంలో వ్యాపారస్తులు ప్రకటించిన బంద్ మంగళవారం కొనసాగుతుంది. అభివృద్ధి పేరుతో చేస్తున్న రోడ్డు వెడల్పు పనులను వెంటనే నిలిపివేయాలని వ్యాపారస్తులు బంద్ ప్రకటించారు. వ్యాపారులు దుకాణాలు తెరవకపోవడంతో బజార్ ఏరియా నిర్మానుషంగా మారింది. రోడ్డు వెడల్పు చేయడం వల్ల తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఉందని వ్యాపారులు వాపోయారు.