జిల్లాలో రైల్వే ఉద్యోగాలకు ఫ్రీ కోచింగ్
TPT: జిల్లాలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రైల్వే రిక్రూట్‌మెంట్ గ్రూప్-డి 2026 పరీక్షలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. తిరుపతిలోని బీసీ స్టడీ సర్కిల్ ద్వారా ఫ్రీగా కోచింగ్ ఉంటుంది. ఈనెల 23వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. 10వ తరగతి మెరిట్ ఆధారంగా 100 మందిని ఎంపిక చేసి 2నెలల శిక్షణ ఇస్తారు.స్టైఫండ్, స్టడీ మెటీరియల్ సైతం అందిస్తారు.