'సౌర విద్యుత్ ఉత్పత్తికి అనువైన భవనాలను గుర్తించాలి'

'సౌర విద్యుత్ ఉత్పత్తికి అనువైన భవనాలను గుర్తించాలి'

ADB: సౌరవిద్యుత్ ఉత్పత్తికి అనువైన ప్రభుత్వ భవనాలను గుర్తించాలని బోథ్ ఎంపీడీఓ రమేష్ సూచించారు. బుధవారం మండల కేంద్రంలో సమావేశంలో ఎంపీడీఓ మాట్లాడారు. సౌర విద్యుత్ ఉత్పత్తికి అవసరమయ్యే సోలార్ ప్యానల్‌ను బిగించుటకు అనువైనటువంటి పాఠశాల, ప్రభుత్వ కార్యాలయాల భవనాలు గుర్తించాలని సూచించారు. ఈనెల 17వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.