'దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది'

RR: దేవాలయాల అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని షాద్‌నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. ఫరూఖ్ నగర్ మండల పరిధిలోని అంబా భవాని మాత దేవాలయం అభివృద్ధికి పలువురు రూ.2 లక్షల విరాళాన్ని అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రాచీన దేవాలయాలు మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయని, పురాతన దేవాలయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.