ఉన్నత లక్ష్యాలే విజయానికి తొలి అడుగు: కలెక్టర్

ఉన్నత లక్ష్యాలే విజయానికి తొలి అడుగు: కలెక్టర్

SRD: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకుని వాటి సాధన కోసం నిరంతరం కృషి చేయాలని కలెక్టర్ పీ.ప్రావీణ్య సూచించారు. శుక్రవారం పఠాన్‌చెరు మండలం ముత్తంగిలోని మహాత్మ జ్యోతిబాపూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల, కళాశాలను ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు.