ఇచ్ఛాపురంలో ట్రీ కటింగ్ పనులు
SKLM: ఇచ్ఛాపురం మున్సిపాలిటీలో విద్యుత్ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఏఎస్‌పేట, పురుషోత్తపురంలో శనివారం ట్రీ కటింగ్ పనులు జరిగాయి. ఇందులో భాగంగా ఇచ్ఛాపురం పట్టణంలోని పలు ప్రాంతాలకు విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కలుపు మొక్కలు కరెంటు తీగలకు పాకేయడంతో ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నందున జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టామని విద్యుత్ లైన్‌మెన్ తెలిపారు.