తిరుమల చేరుకున్న కేంద్ర మంత్రి నిర్మలసీతారామన్

తిరుపతి: తిరుమల శ్రీవారి దర్శనార్థం గురువారం సాయంత్రం కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ గాయత్రి అతిథి భవనం వద్దకు చేరుకున్నారు. ముందుగా ఆమెకు టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ మురళీకృష్ణ, రిసెప్షన్ డిప్యూటీ ఈవో భాస్కర్ స్వాగతం పలికి బస ఏర్పాట్లు చేశారు. రాత్రికి ఆమె తిరుమలలో బస చేసి శుక్రవారం ఉదయం స్వామివారిని దర్శించుకోనున్నారు.