దోమల నివారణ మందు పిచికారి

దోమల నివారణ మందు పిచికారి

KDP: కమలాపురం నగర పంచాయతీ కమీషనర్ బీ.ప్రహ్లాద్ ఆదేశాల మేరకు, RS రోడ్డు, బీడీ కాలనీలలో దోమల నివారణ మందు పిచికారి చేశారు. సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రజలను రక్షించేందుకు ఈ చర్యలు చేపట్టారు. కమలాపురం నగర పంచాయతీలోని ప్రతి కాలనీలో దోమల నివారణ మందు పిచికారి చేస్తామని అధికారులు హామీ ఇచ్చారు. ఈ చర్యలతో RS రోడ్డు, బీడీ కాలనీ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.