నేటి నుంచి అమ్మవారి తీర్థ మహోత్సవం
VSP: ఆనందపురం మండలం మిందివానిపాలెం గ్రామ దేవత శ్రీ మరిడిమాంబ అమ్మవారి తీర్థ మహోత్సవం ఆదివారం నిర్వహించనున్నట్లు గ్రామ ప్రజలు తెలిపారు. తెల్లవారుజాము నుంచే ఆలయం వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహిస్తామన్నారు. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు, బుర్రకథ ఏర్పాటు చేస్తామని, కావున భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలలో పాల్గొనాలని కోరారు.