గండి రామారం పంపు హౌస్‌ను పరిశీలించిన ఎమ్మెల్యే
JN: చిల్పూర్ మండలం గండి రామారం పంపు హౌస్‌ను ఎమ్మెల్యే కడియం శ్రీహరి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఎత్తిపోతల పనుల పురోగతిని సమీక్షించారు. అక్కడ పనిచేస్తున్న ఇంజనీర్లు, అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు పనులు వేగవంతం చేయాలని సూచించారు. రైతుల సాగుకు నీటిని అందించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దీంతో రైతుల సమస్య తీరబోతుందని పేర్కొన్నారు.