ప్రజలు ఎవరు ఆందోళన చెందువద్దు: సీఐ
VKB: రెండు రోజుల క్రితం పెద్దేముల్ మండలంలో పలు గ్రామాల్లో అనుమానాస్పదంగా డ్రోన్లు చెక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఘటనపై ముమ్మర తనిఖీలు నిర్వహిస్తున్నట్లు తాండూర్ రూరల్ సీఐ నాగేష్ తెలిపారు. ఇప్పటివరకు ఎలాంటి ఆచూకీ లభించలేదని అధికారులు చెప్పారు. అనుమానాస్పదంగా ఎవరైనా కనిపించిన వెంటనే 100 కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.