పదవ తరగతి పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి..!
KDP: ఈనెల 16వ తేదీ నుంచి పదవ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్న నేపథ్యంలో తొండూరు మండలంలో అన్ని ఏర్పాట్లు చేశామని ఎంఈవో శివప్రసాద్ రాజు తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. తొండూరు మండలంలో రెండు సెంటర్లు ఏర్పాటు చేయగా, అందులో 268 మంది పదవ తరగతి విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని తెలిపారు. ఈ పరీక్షలకు 18 మంది ఇన్విజిలేటర్లను నియమించామన్నారు.