సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన కలెక్టర్

సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను సందర్శించిన కలెక్టర్

WGL: వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌ను గురువారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె నిర్మాణ పనుల ప్రగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. నిర్ణయించిన గడువులోపే పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు.