'మొబైల్ ఫోన్ పోతే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి'

'మొబైల్ ఫోన్ పోతే CEIR పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి'

ASF: వాంకిడి మండలం సరెండికి చెందిన రోహిత్ తన పోకో ఎస్ 2 మొబైల్‌ను వాంకిడి మార్కెట్‌లో పోగొట్టుకున్నాడు. దీనిపై వాంకిడి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా, పోలీసులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా మొబైల్‌ను ట్రేస్ చేసి రోహిత్‌కు అప్పగించారు. ఈ సందర్భంగా వాంకిడి ఎస్సై మహేందర్ మాట్లాడుతూ.. మొబైల్ పోయిన వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.