ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి

ఇద్దరు పిల్లలతో వాగులో దూకిన తల్లి

MDK: మాసాయిపేటకు చెందిన వడ్డేపల్లి మమత ఇద్దరు పిల్లలు పూజిత(7), తేజస్విని(5)తో వాగుతో దూకింది. గమనించిన స్థానికులు ఆమెను బయటకు లాగగా పిల్లలు గల్లంతయ్యారు. మమత భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లలతో తల్లిగారి ఇంటి వద్ద ఉంటోంది. సమాచారం అందుకున్న పోలీసులు తూప్రాన్ ఎస్ఐ శివానందం ఆధ్వర్యంలో గాలింపు చేపట్టారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.