'స్వచ్ఛ సర్వేక్షణ్‌లో ర్యాంకులు మెరుగుపరచాలి'
VZM: స్వచ్ఛ సర్వేక్షణ్‌లో మెరుగైన ర్యాంకులు సాధించేందుకు మున్సిపాలిటీలు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి మున్సిపల్ కమిషనర్లకు సూచించారు. బుధవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. త్రాగునీరు కలుషితం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పారిశుధ్యాన్ని మెరుగుపరచాలన్నారు.