NHTS కుటుంబ సర్వే 95 శాతం పూర్తి!

నల్గొండ: అంగన్వాడి కేంద్రాల్లో జరిగే అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు. .. ప్రభుత్వం చేపట్టిన NHTS కుటుంబ సర్వే పూర్తికావొచ్చింది. మార్చి నెలలోనే ఇది ప్రారంభం కాగా.. ఎన్నికలతో కొంతకాలం వాయిదా పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కుటుంబ సర్వే ముమ్మరంగా చేపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని 4203 అంగన్వాడీ కేంద్రాల్లో. దాదాపుగా 95 శాతం సర్వే పూర్తయిందని పేర్కొన్నారు.