అనాథ బాలుడి దీనస్థితి.. ఆదుకుంటామన్న ఎస్టీ కమిషన్ ఛైర్మన్
అల్లూరి: రాజవొమ్మంగిలో తల్లిదండ్రులు, నానమ్మను కోల్పోయి అనాథగా మారిన సంజీవ్ అనే బాలుడు అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆసుపత్రికి తీసుకెళ్లేవారు లేక ఇబ్బంది పడుతున్న బాలుడి దీనస్థితిని సోమవారం గ్రామానికి వచ్చిన ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బొజ్జిరెడ్డికి స్థానికులు వివరించారు. స్పందించిన ఆయన, అధికారులతో మాట్లాడి బాలుడిని ఆదుకుని, తగిన పరిష్కారం చూపుతామని హామీ ఇచ్చారు.