ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్

ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్

హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు కొత్త డ్రెస్ కోడ్‌ను ప్రవేశపెట్టింది. అధికారులు, ఇతర ఉద్యోగులు ఇకపై జీన్స్, టీ-షర్టులు, ఫ్యాన్సీ దుస్తులు ధరించడంపై నిషేధం విధించింది. ఈ నిబంధనలను ఉల్లఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ నిబంధనలు పాటించేలా చూడాలని పరిపాలనా కార్యదర్శులు, జిల్లా అధికారులను ఆదేశించింది.