VIDEO: కొబ్బరి చెట్టుపై పిడుగుపాటు
ASR: కొయ్యూరు మండలంలో శనివారం సాయంత్రం కొన్నిచోట్ల తేలికపాటి జల్లులు, మరికొన్నిచోట్ల ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. గంపరాయి గ్రామంలో ఈదురుగాలులకు తోడు పిడుగులు పడ్డాయి. ఈ క్రమంలో గ్రామం మధ్యలో ఉన్న కొబ్బరి చెట్టుపై పిడుగు పడింది. దీంతో మంటలు చెలరేగాయి. పిడుగుపాటుకు గ్రామస్తులు ఆందోళన చెందారు. వర్షం కురుస్తున్న సమయంలో చెట్ల కింద ఉండకూడదని అధికారులు సూచించారు.