బీజేపీ తరఫున పోటీ చేస్తున్న 'సోనియా గాంధీ'
కేరళ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఓ మహిళ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ మహిళ పేరు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ పేరు ఒక్కటే కావటం విశేషం. తన భర్త సహకారంతో ఈ సోనియా గాంధీ మున్నార్ పంచాయతీ నుంచి బరిలో దిగుతోంది. ఆమె తండ్రి గతంలో కాంగ్రెస్ కార్యకర్తగా పని చేశాడు. సోనియా గాంధీపై ఉన్న అభిమానంతో తమ కుమార్తకు ఆ పేరును పెట్టుకున్నాడు.