'యూరియా కొరతను తక్షణం తీర్చకపోతే ఆందోళన తప్పదు'

KDP: జిల్లాలో నెలకొన్న యూరియా కొరతను తక్షణం తీర్చకపోతే ఆందోళన తప్పదని రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి తెలిపారు. కడపలో ఎరువుల దుకాణాలను ఆయన పరిశీలించారు.కడప జిల్లాలో అవసరమైన 20,500 టన్నులలో 4,062 టన్నులే అందాయని, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే యూరియా చేరుతుందని, పేద రైతులకు అందడం లేదని ఆరోపించారు. తక్షణ సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.