రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

E.G: ఆర్డీఎస్ఎస్ పనుల కారణంగా కడియం మండలంలో మంగళవారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉంటుందని ఈఈ బి.నటరాజన్ సోమవారం తెలిపారు. మురమండ, వేమగిరి సబ్ స్టేషన్‌ల పరిధిలోని మురమండ, మాధవరాయుడుపాలెం, దామిరెడ్డిపల్లి, వీరవరం, దుళ్ల గ్రామాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ ఉండదని పేర్కొన్నారు. వినియోగదారులు సహకరించాలని ఆయన కోరారు.