ఎరువుల దుకాణాలపై అధికారుల తనిఖీలు

ఎరువుల దుకాణాలపై అధికారుల తనిఖీలు

PLD: కారంపూడి మండలంలోని ఎరువుల దుకాణాలపై తహసీల్దార్ వెంకటేశ్వర్లు నాయక్, వ్యవసాయ అధికారి పోట్ల నరసింహరావు, ఎస్‌ఐ వాసు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఎరువుల నిల్వలు, ధరలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు. ఎమ్మార్పీ ధరలకే ఎరువులు విక్రయించాలని, అధిక ధరలకు అమ్మితే షాపులను సీజ్ చేసి కేసులు నమోదు చేస్తామని డీలర్లను హెచ్చరించారు.